రాజ్ తరుణ్ కి బంపర్ ఆఫర్

Raj-Tarun
Raj-Tarun

ఉయ్యాలా-జంపాల సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి,అనుకోకుండా ఆ సినిమాలో హీరో గా మారి,అక్కడితో ఆగకండా బ్యాక్ టు బ్యాక్ మూడు సక్సెస్ లు అందుకున్న రాజ్ తరుణ్ కెరీర్ రాకెట్ లా దూసుకెళ్లింది.కానీ ఎక్కువ సినిమాలు చెయ్యాలి అన్న తపనలో కథల ఎంపికలో అతను చేసిన మిస్టేక్స్ తో వరుసగా పరాజయాలు పలకరించాయి.AK ఎంటర్టైన్మెంట్స్ లో నాలుగు సినిమాలకు కమిట్ అయిన రాజ్ తరుణ్ వాటిలో ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో పూర్తిగా మార్కెట్ ని కోల్పోయాడు.

చాలామంది హీరోలకు కష్టకాలంలో హిట్ ఇచ్చి వాళ్ళ కెరీర్ సెట్ రైట్ చేసిన దిల్ రాజు కూడా రాజ్ తరుణ్ ఫ్లాపుల ప్రవాహాన్ని ఆపలేకపోయాడు.రాక్ తరుణ్ తో తీసిన లవర్ డిజాస్టర్ గా మిగిలింది.ప్రస్తుతం రాజ్ తరుణ్ తో సినిమా తియ్యడానికి ఎవ్వరూ ముందుకి రావట్లేదు.ఒక కొత్త డైరెక్టర్ తో కూర్చుని కథ చెక్కుతున్నా అది ఒక కొలిక్కి రావట్లేదు.అయితే ఈ క్రిటికల్ టైం లో ఒక గోల్డెన్ ఆఫర్ వరించింది.లవర్ సినిమా తీసిన దిల్ రాజు మళ్ళీ రాజ్ తరుణ్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడు

గత ఏడాది ఫ్లాపులతో ఢీలా పడిన SVC కి F2 మామూలు కిక్ ఇవ్వలేదు.దాంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఆరు సినిమాలు ప్రొడ్యూస్ చెయ్యాలని ఫిక్స్ అయిన దిల్ రాజు వరుసగా ప్రాజెక్ట్స్ సెట్ చేస్తున్నాడు.మహేష్ మేనల్లుడు కోసం దిల్ రాజు తయారుచేయించిన ఒక కథ రాజ్ తరుణ్ కి సెట్ చెయ్యబోతున్నారు.ఆ సినిమా కథపై కాన్ఫిడెన్స్ గా ఉన్న దిల్ రాజు ఈ డెసిషన్ తీసుకున్నాడు.గతంలో ఆడు మగాడ్రా బుజ్జి అనే సినిమా డైరెక్ట్ చేసిన కృష్ణా రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్.కనీసం ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కి సక్సెస్ అందిస్తే ఈ యంగ్ హీరో ట్రాక్ ఎక్కేసినట్టే.