కేంద్ర మధ్యంతర బడ్జెట్ ముఖ్యంశాలు

Budget 2019
Budget 2019

కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను రూ. 27,84,200 కోట్లకు అంచనా వేశారు. రైల్వే రంగానికి బడ్జెటరీ సపోర్టు కింద రూ. 64 వేల 587 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మిజోరాం, మేఘాలయా రాష్ర్టాలను రైల్వేతో అనుసంధానం చేశామన్నారు. రైల్వేల చరిత్రలో ఇది ప్రమాదాలు తక్కువగా ఉన్న ఏడాది అని స్పష్టం చేశారు. బ్రాడ్ గేజ్‌లో కాపలా లేని గేట్లను తొలగించామని వెల్ల‌డించారు.

* 2018-19 ద్రవ్యలోటు అంచనా 3.4 శాతం.
* కరెంట్ అకౌంట్ లోటును 5.6 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాం.
* అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోదీదే.
* రైతుల పాలన రెట్టింపు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.
* అందరికీ ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.
* ఆర్థిక వృద్ధిలో శరవేగంగా దూసుకెళుతున్నభార‌త్ .
* స్వచ్ఛభారత్ అత్యంత విజయవంతం .
* అగ్రవర్ణాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
* ఉపాధి హామీ పథకానికి ఈ సంవత్సరం రూ. 60 వేల కోట్ల కేటాయింపులు.
* గడచిన నాలుగేళ్లలో 1.53 కోట్ల ఇళ్లను నిర్మించి ఇచ్చాం.
* మార్చి నాటికి దేశంలోని అన్ని ఇళ్లకూ విద్యుత్ సరఫరా.
* ఎల్ఈడీ బల్బులతో దేశంలో రూ. 50 వేల కోట్లను ఆదా చేశాం.
* కొత్తగా ఏడు ఎయిమ్స్ ఆసుపత్రులు
* పెన్షన్ విధానానికి మార్పులు.
* పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంపు.
* ఈఎస్ఐ ప‌రిమితి రూ. 15 వేల నుంచి రూ. 21 వేలకు పెంపు.
* ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పేరిట మరో సరి కొత్త ప‌ధ‌కం.
* నెలకు రూ. 100 చెల్లిస్తే సరిపోతుంది.
* రూ. 15 వేల నెల జీతం ఉండే వేతన జీవులకు కొత్త పథకం.
* కొత్త పెన్షన్ విధానంలో నెలకు రూ. 3 వేలు అంద‌జేత .
* కొత్త పెన్షన్ విధానానికి రూ. 500 కోట్ల కేటాయింపు.
* 10 కోట్ల మంది కార్మికులకు పెన్షన్ ప‌ధ‌కం .
* గ్రాట్యుటీ లిమిట్ రూ. 10 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు.
* ఉజ్వల యోజన కింద 8 కోట్ల ఉచిత వంటగ్యాస్ కనెక్షన్లు.
* ముద్ర యోజనలో రూ. 7.23 లక్షల కోట్ల రుణాలు.
* రక్షణ రంగానికి రూ. 3 లక్షల కోట్ల కేటాయింపు.
* కార్మికుల ప్రమాద బీమా రూ. 1.50 లక్షల నుంచి రూ. 6 లక్షలకు పెంపు.
* 60 ఏళ్లు దాటిన కార్మికులంతా పెన్షన్ స్కీమ్ లో భాగస్తులు.
* సినిమా పరిశ్రమ 12 శాతం జీఎస్టీ పరిధిలోకి.
* సినిమా షూటింగ్ అనుమతులకు సింగిల్ విండో.
* ఇండియాను కాలుష్య రహిత భారతావనిగా మార్చేందుకు చర్యలు.
* ఎలక్ట్రిక్ వాహనాలకు మరిన్ని రాయితీలు.
* ట్రాన్స్ పోర్ట్ విప్లవంలో ప్రపంచానికే ఆదర్శంగా మారనున్న భారతావని.
* సరుకు రవాణా రంగంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం.
* పోస్టల్, బ్యాంకు డిపాజిట్లపై టీడీఎస్ పరిమితి పెంపు.
* టీడీఎస్ పరిమితి రూ. 10 వేల నుంచి రూ. 40 వేలకు పెంపు.
* స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ. 40 వేల నుంచి రూ. 50 వేలకు పెంపు.
* ఇంటి అద్దెలపై టీడీఎస్ రూ. 1.80 లక్షల నుంచి రూ. 2.40 లక్షలకు పెంపు.