బ్రోచే వారెవరురా మూవీ టీజర్ రిలీజ్…!

Brochevarevarura
Brochevarevarura

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీ విష్ణు,మలయాళం బ్యూటీ నివేథ థామస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ ‘బ్రోచే వారెవరురా’. ఈ సినిమాలో నివేథ థామస్ క్లాసికల్‌ డ్యాన్సర్‌గా నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్‌ పార్ట్‌ పూర్తిచేసుకుని, ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటుంది.ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 20 న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ చిత్రాన్ని మేలో విడుదల చేయనున్నారు. మన్యం ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్‌, నివేదా పెతురాజ్‌, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలలో నటిస్తున్నారు.