‘బ్రోచేవారెవరురా’ ఫస్ట్ లుక్ విడుదల…!

Sree Vishnu,Brochevarevarura

ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమయిన సినిమాలు చేసిన,చేస్తున్న శ్రీ విష్ణు మళ్ళీ అలాంటి ఒక సినిమాని ఓకే చేసాడు.c అనే టైటిల్ తో తెరకెక్కుతున్నఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు.ఇంటికి దిష్టి తగలకుండా కట్టుకునే దిష్టిబొమ్మతో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఇన్స్టంట్ అటెంన్షన్ తెచ్చుకుంది ఆ టీమ్.చలనమే చిత్రము-చిత్రమే చలనము అనే ట్యాగ్ లైన్ కూడా అట్రాక్టివ్ గా ఉంది.2019 లో ఎవ్వరికి దిష్టి తగలకూడదు అని రాసిన లైన్స్ చాలా యూనీక్ గా అనిపించాయి.ఇంతకుముందు శ్రీవిష్ణు తో మెంటల్ మదిలో అనే సిమిమా చేసిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాని రూపొందిస్తున్నాడు.అలాగే టాలెంటెడ్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న సత్యదేవ్ ఈ సినిమాలో మరో ముఖ్యమయిన పాత్రలో కనిపిస్తున్నాడు.

నివేత థామస్ తో పాటు మెంటల్ మదిలో హీరోయిన్ గా నటించిన నివేత పేతురాజ్ మరో హీరోయిన్ గా కనిపిస్తుంది.ఇక పెళ్లి చూపులు ఫేమ్ వివేక్ సాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.విభిన్నమయిన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా 2019 లో ప్రేక్షకులముందుకు వస్తుంది.ఒకే ఒక్క పోస్టర్ తో ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ అయిపోయే ఇలాంటి పోస్టర్స్ మాత్రం అరుదుగా వస్తుంటాయి.ఈ సినిమాపై ఇప్పుడే ఇంత ఆసక్తి రేకెత్తించిన టీమ్ ఇక ముందు ముందు ఎలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ తో మెప్పిస్తుందో చూడాలి.