వినయ విదేయ రామ కోసం బోయపాటి కొత్త స్ట్రాటజీస్…!

vinaya vidheya rama

బోయపాటి సినిమా అంటేనే ఊర మాస్ అనే క్లారిటీ అందరికి ఉంది.ముందు ఆ స్టేటస్ ని బాగానే ఎంజాయ్ చేసిన బోయపాటి రాను రాను దాని వల్ల జరుగుతున్న నష్టాన్ని గమనించాడు.అందుకే సినిమాల పేర్లతో,ప్రోమోలతో తన సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని కన్వే చేసే ప్రయత్నం చేస్తుంటాడు.ముందు వినయ విధేయ రామ కి కూడా ఇదే ఫార్ములా వాడాడు.కానీ ట్రైలర్ లో విధ్వంసక రాముడిని చూపించాడు.మాస్ కూడా బాబోయ్ అనే రేంజ్ లో ఆ ట్రైలర్ కట్ చేసాడు.

తీరా రిలీజ్ టైం దగ్గరపడుతున్న వేళ ఒక పక్క ఎన్టీఆర్,మరో పక్క F2 గట్టి పోటీ ఇస్తున్నాయి.ఆ రెండూ కూడా పండక్కి పర్ఫెక్ట్ సినిమాల్లా కనిపిస్తున్నాయి.వాటి మధ్య వస్తున్న ఈ మాస్ మసాలా సినిమాకి పెద్దగా స్కోప్ దక్కట్లేదు.అందుకే అది గమనించి ఇప్పడు వినయ విధేయ రామ నుండి ఫ్యామిలీ సాంగ్ ప్రోమో ని రిలీజ్ చేసి ఈ సినిమాలో ఎమోషన్స్ బలంగా ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.మొత్తానికి మొదటి నుండి రకరకాల విషయాలతో,వార్తలతో ప్రాబ్లెమ్స్ ఎదుర్కుంటున్న వినయ విధేయ రామ రిలీజ్ తరువాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.