మోదీ టూర్ కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ బ్లాక్ డే పిలుపు

congress party
congress party

ప్రధాని నరేంద్ర మోడీ ఏ ముఖం పెట్టుకుని ఎపికి వస్తున్నారని ఆంద్ర‌ప్ర‌దేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశ్నించారు. విభజన హామీలు అమలు చేయడంలో మోడీ ఘోరంగా విఫలమయ్యారని ధ్వ‌జ‌మెత్తారు. మోదీ టూర్ ని పుర‌స్క‌రించుకుని ఆదివారం బ్లాక్ డే గా పాటిద్దామ‌ని పార్టీ శ్రేణుల‌కు ర‌ఘ‌వీరా పిలుపునిచ్చారు.

ఢిల్లిలో కాంగ్రెస్‌ వార్‌రూమ్‌లో సార్వత్రిక ఎన్నికల సన్నాహక సమావేశంకు ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి హాజ‌రైన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థులను ఈ నెలాఖరులోగా ఖరారు చేస్తామన్నారు. మార్చి మొదటి వారం లో రాహుల్‌ పర్యటిస్తారని వెల్ల‌డించారు ర‌ఘ‌వీరా.