తెలంగాణలో బిజేపి బంద్ పాక్షికం

telangana inter results bjp band
telangana inter results bjp band

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బిజెపి తెలంగాణలో బంద్‌ చేపట్టింది. అయితే ఈ బంద్‌ పాక్షికంగా జ‌రిగింది. విద్యార్ధులకు, తల్లిదండ్రులకు న్యాయం చేసేందుకు బంద్‌ తలపెట్టిన బిజెపి పార్టీ శ్రేణులు ఉదయం నుంచే ఆందోళనలు చేపట్టారు. బస్సు డిపోల ఎదుట బైఠాయించి రాకపోకలకు అంతరాయం కలిగించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. కరీంనగర్‌లో ఏబివిపి కార్యకర్తలు కొన్ని కళాశాలలను మూసివేయించారు. రాష్ట్రంలో చాలా చోట్ల బంద్‌ పాక్షికంగానే కొనసాగింది. బంద్‌ నేపథ్యంలో పలుచోట్ల బిజెపి నేతలను ముందుగానే అదుపులోకి తీసుకున్నారు.