దీదీకి స‌వాల్ విసిరిన అమిత్ షా

Mamata-Amit Shah
Mamata-Amit Shah

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సవాల్‌ విసిరారు. జై శ్రీరాం అని నినాదాలు చేస్తానని, తనను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సౌత్‌ 24 పరగణాల్లో అమిత్‌ షా ప్రచారం నిర్వహించారు. మమతా దీదీ… జై శ్రీరాం అంటూ నేను కోల్‌కతాలోనే ఉంటాన‌ని, మీకు ధైర్యం ఉంటే త‌న‌ని అరెస్ట్ చేయాల‌ని సవాల్ చేశారు. కాగా అమిత్‌ షా ర్యాలీతో పాటు హెలికాప‍్టర్‌ ల్యాండ్‌ అయ్యేందుకు మమతా సర్కార్‌ అనుమతి నిరాకరించింది.