గత ప్రభుత్వాల పాపాలను ప్రక్షాళన చేయడం సాధ్యం కాదు – ప్ర‌ధాని మోదీ

pm-modi
pm-modi

రైతులకు తన ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయపడుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మునుపటి ప్రభుత్వాలు రైతులను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని గట్టిగా సమర్థించుకున్నారు.

రైతు సంక్షేమం కోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. రైతు సమస్యల పరిష్కారానికి, వారిని సాధికారులను చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల పాపాలను ప్రక్షాళన చేయడం సాధ్యం కాదన్నారు. రైతులను గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే పరిగణించాయన్నారు.