చంద్ర‌బాబు పై సోము సెటైర్లు

Somu Veeraj
Somu Veeraj

అబద్ధాలు చెప్పడం, రాయడంలో చంద్రబాబు చిత్రగుప్తుడు అంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ బాబు మంగళగిరి అని పలుకలేకపోతున్నాడు.. తింగరి మంగళం లోకేష్‌ అంటూ ఎద్దేవా చేశారు. అమ‌రావ‌తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈసీ, ఈవీఎంలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని వ్యాఖ్యానించారు. ఎన్నికలను ఈసీ జరిపిస్తుందా ? లేక ఏపీ ప్రభుత్వం జరిపిస్తుందా ? అని చంద్రబాబును ప్రశ్నించారు.

యూటర్న్‌లు ఎక్కువగా తీసుకున్న పేరు బాబుకి దక్కిందని, వివాదాలు నిర్మాణం చేయడంలో బాబు దిట్టని విమర్శించారు. బాబు తిరోగమనం వైపు పయనిస్తున్నారని, ఈ ఐదేళ్లలో ఆయన తీరు బాధాకరమన్నారు. ఎలక్షన్‌పై ఆయన మాటలు.. ఆయన వైఖరిని తెలియజేస్తున్నాయన్నారు. కేంద్రం కియా కంపెనీని ఏర్పాటుచేస్తే అది తానే తెచ్చానని చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని సోము వీర్రాజు విమర్శించారు. మోదీ వల్ల 20 రకాల అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో, పట్టణాల్లో జరిగాయని ఆయ‌న వివ‌రించారు.