గాజు గ్లాస్ ప‌ట్టుకునేందుకు ఆకుల సై…

Akula Satyanarayana

బీజేపీ సీనియర్ నేత, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీలో చేరతున్న‌ట్లు క్లారిటీ ఇచ్చేశారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నిజమని నిరూపిస్తూ కేడ‌ర్ ఉత్కంఠ‌కు తెర దించారు.త్వరలోనే బీజేపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్లు మీడియా ముందు ప్ర‌క‌టించారు. ఆకుల ఈనెల 21వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరాలని ముహూర్తం పెట్టుకున‌న్నారు.

ఇప్పటికే జనసేన అధినేత చర్చలు జరిగాయని ఆకులకు రాజమండ్రి పార్లమెంట్ స్థానం, ఆయన భార్య పద్మావతికి రాజానగరం అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు పవన్ అంగీకరించినట్లు స‌మాచారం. దేశంలో బీజేపీ ఒక క్రమశిక్షణ కలిగిన పటిష్టవంతమైన నాయకత్వం కలిగిన పార్టీ అని, అయితే ఏపీలో మాత్రం అస్తవ్యస్తంగా ఉందని వ్యాఖ్యానించారు ఆకుల‌.