మ‌ళ్లీ తెర‌పైకి రామ మందిర నిర్మాణం తెచ్చిన బిజేపి

BJp
BJp

ఎన్నిక‌ల వేళ మ‌ళ్లీ  తెర‌పైకి రామ మందిర నిర్మాణం తెచ్చింది భార‌తీయ జ‌న‌తా పార్టీ. దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ఆ పార్టీ జాతీయ సమ్మేళనంలో జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. వచ్చే ఎన్నికల ప్రాధాన్యాన్ని వివరించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రానున్న ఎన్నికలు రెండు భిన్నమైన సిద్ధాంతాల మధ్య జరిగే పోటీ అని అభివ‌ర్ణించారు.అయోధ్యలో తొందరగా రామ మందిర నిర్మాణాన్ని చేపట్టాలని పార్టీ పట్టుదలతో ఉండగా, కాంగ్రెస్‌ అడ్డంకులు కల్పిస్తోంద‌న్నారు అమిత్ షా.

అయితే బీజేపీ రామ మందిరాన్ని నిర్మించి తీరుతుంద‌న్నారు. మందిర నిర్మాణంపై కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరేంటో స్పష్టం చేయాలని అమిత్‌ షా డిమాండ్‌ చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దేశ చరిత్రను మలుపు తిప్పిన మూడో పానిపట్‌ యుద్ధం వంటివన్నారు. ఈ ఎన్నికలు బీజేపీ సాంస్కృతిక జాతీయ వాదానికీ, ప్రతిపక్షాల అధికార దాహానికి మధ్యనే జరగనున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు . ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌లు ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారని ఎద్దేవా చేశారు అమిత్ షా.