బర్త్ డే రోజే 2 లక్షల విరాళం …ఎవరు?

Birthday, SunilHero, Bellamkonda Suresh , raja ravindra, shambo shiva shambo film,

కమెడియన్ గా సినీ ప్రవేశం చేసి, మర్యాద రామన్న, పూలరంగడు చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచుకున్నారు . సునీల్ ఈ రోజు(ఫిబ్రవరి 28) పుట్టిన రోజు వేడుకలను దేవనార్ బ్లైండ్ స్కూల్ లో చేసుకున్నారు. అంధులతో బర్త్ డే ను  చేసుకున్నారు. అదే విధంగా రూ. 2 లక్షలను అంధ విద్యార్థుల సహాయార్థం విరాళంగా ఇచ్చారు.

ఈ కార్యక్రమం లో సునీల్, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శకురాలు బి జయ, రాజా రవీందర్, దేవనార్ చైర్మన్ స్వామిగౌడ్, దేవానార్ డైరెక్టర్ శ్రీమతి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. సునీల్ తమతో కలిసి పుట్టినరోజు, ఆర్థిక సహాయం చేయడంపై అంధ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా సునీల్ …’శంభో శివ శంభో సినిమా షూటింగ్ అప్పుడు ఇక్కడకు వచ్చాను అని మళ్లీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలాంతా నన్ను గుర్తు పెట్టుకుని అన్నా నువ్వు శంభో శివ శంభో అప్పుడు వచ్చావు కదా అని పలకరించడం చాలా గొప్పగా అనుభూతిని కలిగించింది.

 

నేను ఇచ్చింది తక్కువే అయినా కానీ నాలా మరికొంత మంది ముందుకు వస్తారనే ఆశతో ఈ సాయం చేస్తున్నాను’ తెలిపారు. ఇక (మార్చి 1) విడుదల  ‘మిస్టర్ పెళ్లి కొడుకు సినిమా .. సునీల్, ఇషాచావ్లా జంటగా మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై. లిమిటెడ్మిస్టర్ పెళ్లి కొడుకు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కి ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ నిర్మాతలు. ఆర్.బి.చౌదరి సమర్పిస్తున్నారు. సి.దేవీ ప్రసాద్ దర్శకత్వం .