పేరు అంతరిక్షం…ఫలితం పాతాళం

Anthariksham

నేషనల్ రేంజ్ ఇమేజ్ ఉన్న సంకల్ప్ రెడ్డి డైరెక్టర్,బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్నవరుణ్ తేజ్ హీరో,సెన్సిబిలిటీస్ బాగా ఉన్న క్రిష్ ప్రొడ్యూసర్ అనగానే ఆ సినిమా రేంజ్ గురించి ఒక రేంజ్ లో ఊహించుకోవడం,ఆ సినిమాకి సూపర్ హైప్ రావడం కామన్.అంతరిక్షం సినిమాకి కూడా అలానే జరిగింది.రిలీజ్ కి ముందు ఈ సినిమాకి మామూలు హైప్ రాలేదు.ఘాజి లా మరో రాజీ లేని బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ కి ఇయర్ ఎండింగ్ బూస్ట్ లభిస్తుంది అనే అంచనాలు కాదు కన్ఫర్మేషన్స్ వచ్చాయి.సినిమా రిలీజ్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది.

స్క్రిప్ట్ లో ఎక్కడో కాంప్రమైజ్ అయ్యారు అని అర్ధమయింది.సినిమాటిక్ లిబర్టీ ని దాటేసి అంతరిక్షం కోసం అంతులేని లీనియన్స్ తీసుకున్నారు.దీంతో కొంతందనికి సినిమా అర్ధం కాలేదు,అర్ధమయిన వాళ్లకు నచ్చలేదు.అయినా కూడా ఈ సినిమా ఒక మోస్తరు కలెక్షన్స్ తో సేఫ్ సైడ్ కి చేరుకుంటుంది అనుకున్నారు.కానీ అంతరిక్షం ఫైనల్ కలెక్షన్స్ చూసిన వాళ్ళు షాక్ తింటున్నారు.డ్రీమ్ రన్ కంటిన్యూ చెయ్యలేకపోయిన ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా తీవ్రంగా నిరాశపరిచింది.మరీ భారీ బడ్జెట్ కాకపోయినా పాతిక నుండి ముప్పై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది అంతరిక్షం 9000 KMPH.తీవ్రమయిన పోటీ లో రావడం వల్ల సినిమాకి అనుకున్న రేటు రాలేదు.

కానీ ఇప్పడు చూస్తే అసలు వచ్చిన రేటే ఎక్కువ అన్నట్టు ఉంది పరిస్థితి.సినిమాకి పెట్టిన దాంట్లో సగం కూడా కలెక్ట్ చెయ్యలేకపోవడం చూస్తే ఈ సినిమా దుస్థితి తెలుస్తుంది.ఫుల్ రన్ లో అంతరిక్షం 7 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది అంచనా.ఇది బ్యాడ్ సినిమా కాదు కానీ కలెక్షన్స్ మాత్రం బ్యాడ్.బ్యాడ్ టైం అంటే ఇదేనేమో.