‘రాక్షసుడు’ టైటిల్ తో వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్‌…!

Bellamkonda-Sai-Srinivas
Bellamkonda-Sai-Srinivas

రమేష్‌ వర్మ దర్శకత్వంలో  బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ‘తమిళంలో విడుదలై బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘రాచ్చసన్‌’ చిత్రాన్ని రీమేక్‌ గా వస్తుంది.ఏ స్టూడియోస్‌ బ్యానర్‌ పతాకంపై హవీష్‌ లక్ష్మణ్‌ ప్రొడక్షన్‌ ఫై కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి ‘రాక్షసుడు’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఉగాది పండుగని పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్‌ని ప్రకటించారు. ఇప్పటికే సినిమా 60 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని జూన్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు.