బెల్లంకొండ కొత్త సినిమా ఓపెనింగ్

Bellamkonda Sai Sreenivas
Bellamkonda Sai Sreenivas

బెల్లంకొండ శ్రీనివాస్ కి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాకపోయినా అతని కెరీర్ మాత్రం ఎలాంటి బ్రేక్స్ లేకుండా సాఫిగా సాగిపోతుంది.ఆల్రెడీ AK ఎంటర్టైన్మెంట్స్ లో సీత అనే సినిమా చేస్తున్న బెల్లంకొండ ఇప్పుడు ఇంకో కొత్త సినిమా మొదలుపెట్టాడు.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన రాచ్చసన్ (రాక్షసుడు) సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.ఇంతకుముందు ఒక ఊరిలో,వీర లాంటి సినిమాలు చేసి హిట్ అందుకోలేకపోయిన రమేష్ వర్మ ఈ సారి ఈ సినిమాతో ఎలాగయినా హిట్ కొట్టాలి అని కసిగా ఉన్నాడు.కోనేరు సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తుండగా ఇంతకు ముందు జీనియస్ లాంటి సినిమాల్లో హీరోగా నటించిన హవీష్ ఈ సినిమాకి సమర్పకుడిగా ఉన్నాడు.ఇప్పటువరకు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో స్టార్ హీరోయిన్స్ తోనే జత కట్టిన సాయి శ్రీనివాస్ ఈ సారి రాశి ఖన్నాతో పెయిర్ అప్ అవుతున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఈ రోజు లాంఛనంగా ప్రారంభం అయ్యింది.తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని ఫస్ట్ నితిన్ చెయ్యాలి అనుకున్నాడు.కానీ చివరికి బెల్లంకొండ ఈ సినిమాకి ఫైనల్ అయ్యాడు.ఈ సినిమా లీడ్ పెయిర్ తో పాటు రమేష్ వర్మ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం కావడంతో చాలా జాగ్రతలు తీసుకుంటున్నారు.జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ని ఎంపిక చెయ్యాలి ఉంది.త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.