సీతతో కలిసి వస్తున్న బెల్లంకొండ హీరో

Bellamkonda hero with SitaBellamkonda hero with Sita
Bellamkonda hero with Sita

బెల్లంకొండ సాయి శ్రీనివాస్…ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ భారీ నుండి అతిభారీ సినిమాలే.ఒక్క సినిమాకు లాభాలు వచ్చిన దాఖలాలు లేవు.కానీ సినిమాల లైన్అప్ మాత్రం ఆగడం లేదు.AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన సీత సినిమాని ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయ్యింది.కాజల్ అగార్వల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను కూడా భారీ ఖర్చుతో నిర్మించారు.కానీ ఈ సినిమాని బెల్లంకొండా యాంగిల్ లో కాకుండా కాజల్ అండ్ తేజ ల కాంబో అనే యాంగిల్ లో ప్రొజెక్ట్ చేస్తున్నారు.

బిజినెస్ పరంగా కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు.అయితే ఈ సినిమాకి ఇప్పుడు రిలీజ్ డేట్ ఫైనల్ అయ్యింది.ముందుగా మహర్షి రిలీజ్ కోసం లాక్ చేసిన ఏప్రిల్ 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఆ డేట్ ఒక రకంగా ఈ సినిమాకి ప్లస్ అనుకోవాలి.ఈ సినిమా రిలీజ్ కి ఒక వారం ముందు జెర్సీ థియేటర్స్ లోకి వస్తుంది.ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాల గ్యాప్ లో మహర్షి సినిమా రిలీజ్ అవుతుంది.ఇంత టైట్ కాంపిటేషన్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నారు అంటే సినిమాపై యూనిట్ కి ఎంత నమ్మకం ఉందో అర్ధమవుతుంది.

మరి ఆ నమ్మకం నిజమయ్యి ఈ సారి బెల్లంకొండ బాబు కి హిట్ వస్తే ఇక అతను కాజల్ కాంబో న మాత్రం వదిలిపెట్టడు.