బాధలో ఉన్న మహిళలకు భరోసా సెంటర్లు – ఎంపీ కవిత

K Kavitha TRS
K Kavitha TRS

బాధలో ఉన్న మహిళలకు భరోసా సెంటర్లు పరిష్కారం చూపాలన్నారు నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత . హైద‌రాబాద్ లోని లక్డీకపూల్‌లో నూత‌న మహిళా భద్రతా భవనంను హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు . ఈ కార్యక్రమానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత తదితరులు హాజరయ్యారు.

అనంత‌రం ఎంపి క‌విత మాట్లాడుతూ …మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలపై దాడులను పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు ఆమె. దేశంలోనే తెలంగాణ పోలీసులకు మంచి పేరు వుంద‌న్నారు. మహిళ‌ల భద్రత కోసం షీ టీమ్స్, షీ క్యాబ్స్, భరోసా సెంటర్లు ఏర్పాటు చేశారన్నారు.

మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వెల్ల‌డించారు. నిందితులకు తగిన శిక్ష పడేలా ఉమెన్స్ వింగ్ ఏర్పాటు చేసినట్ లు ఎంపి క‌విత వివ‌రించారు.