రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్ బై…!

Bandla Ganesh
Bandla Ganesh

సినీ నటుడు, నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు అయన. వ్యక్తిగత కారణాల వల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్‌లో తన నిర్ణయాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేందుకు తనకు అవకాశం కల్పించిన నేతలకు గణేష్ ధన్యవాదాలు తెలిపారు.’నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాను. నాకు అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి, ఉత్తమ్ గారికి కృతజ్ఞతలు. ఇక నుంచి నేను ఏ రాజకీయ పార్టీ కి సంబంధించిన వాడిని కాదు.కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గా నా విమర్శలు, వ్యాఖ్యల వల్ల బాధపెట్టిన వారిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాను’ అన్నారు.