ఎన్టీఆర్ కోసం ఆ సెంటిమెంట్ కూడా ఫాలో అవుతున్న బాలయ్య

NTR

బాలకృష్ణ కి మామూలుగానే ముహుర్తాలు,జాతకాలు అంటే నమ్మకం ఎక్కువ.ఇక తన సొంత బ్యానర్ NBK ఫిలిమ్స్ లో డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఎన్టీఆర్ సినిమా విషయం లో అవి ఇంకాస్త ఎక్కువగా ఉండడంలో తప్పులేదు.అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా దగ్గరఉండి మరీ పర్యవేక్షిస్తున్నాడు.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇక్కడ వరుసగా ఇంటర్వ్యూ లు నిర్వహించి ప్రచారం అయిపొయింది అని చేతులు దులిపేసుకోకుండా నిమ్మకూరులో పర్యటించాడు.బెంగుళూరులో కూడా ప్రమోషన్స్ చేసాడు.

ఇక ఈ సినిమా తొలి ఆట ముహూర్తం ప్రకారం ఉదయం అయిదు గంటలకు తన లక్కీ థియేటర్ గా ఫీల్ అయ్యే భ్రమరాంబలో లో వేసేలా ప్లాన్ చేసాడు.ఆ తరువాత మిగతా చోట్ల షో లు స్టార్ట్ అవుతాయి.భ్రమరాంబలో మొదటి షో వేసిన సినిమాలు చాలా వరకు హిట్స్ గా నిలిచాయి.దాంతో ఎన్టీఆర్ కథానాయకుడు మొదటి ఆట అక్కడ వేస్తున్నారు.ఈ సినిమాకి ఆ షో కి ఆల్రెడీ పర్మిషన్ వచ్చేసింది.సో,సినిమా కాస్ట్ అణా క్రూ తో కలిసి అక్కడ బాలయ్య సినిమా చూస్తాడు.ఈ సినిమాపై అంతటా కూడా మంచి అంచనాలున్నాయి.