బాలయ్య సినిమాలో రాజకీయాలు !

Balayya, Politics, BoyapatiSreenu,

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలుసు కదా. ఇప్పటికే ఈ సినిమా ప్రై ప్రొడక్షన్ కార్య క్రమాలను శరవేగంగా పుంజుకున్నాయి. ఫిబ్రవరి మూడో వారంలో పూజా కార్యక్రమాలను జరుపుకో నుంది. అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నారని ఒక పాత్ర లో ముఖ్యమంత్రి పాత్ర అని కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తాజాగా సినీవర్గాల సమాచారాం ప్రకారం ఈ చిత్రంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉండదు అని. కేవలం ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. మరి బాలయ్య – బోయపాటి కాంబినేషన్ తో ఈ సినిమా హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.