ఒకే వేదికపై నందమూరి హీరోలు…!

Nandamuri Heros
Nandamuri Heros

కె.వి.గుహన్ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌రామ్ నటించిన తాజా చిత్రం ‘118’.ఈ సినిమాలో నివేదా థామస్, శాలిని పాండే హీరోయిన్లు గా నటిస్తున్నారు.ఈ చిత్రం మార్చి 1 న విడుదల కానుంది.కాగా ‘118’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ సోమవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో జరుగనుంది.

ఈ ఈవెంట్ కు నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈమధ్య కాలంలో వీరు ముగ్గురు కలిసి స్టేజ్ మీద కనిపించనుండడం ఇది మూడవసారి. ఇంతకుముందు అరవింద సమేత, ఎన్టీఆర్ కథానాయకుడు ఈవెంట్‌లకు వీరు హాజరయ్యారు.శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.