సాహో కోసం ప్రభాస్ ప్లానింగ్

Saaho Prabhas
Saaho Prabhas

బాహుబలి కోసం పెంచుకున్న వెయిట్ ని సైరా కోసం అతి తక్కువ రోజుల్లోనే తగ్గించుకుని స్లిమ్ లుక్ లోకి వచ్చాడు ప్రభాస్.ఇక అతి కష్టమయిన బైక్ స్టoట్స్ తో పాటు అనేక యాక్షన్ సీక్వెన్సెస్ కోసం కూడా ఒళ్ళు హూనం చేసుకున్నాడు.ఆల్రెడీ బాహుబలి తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ ఈ సారి కూడా ఈ సినిమాకోసం కూడా అలానే కష్టపడుతున్నాడు.అయితే బాహుబలి తో ప్రభాస్ కి బాలీవుడ్ లో గుర్తింపు వచ్చినా కూడా అతని వాయిస్ లో మ్యాజిక్ మాత్రం ఇంకా వాళ్ళకి తెలియలేదు.అందుకే ఈ సారి సాహో కి స్వయంగా డబ్బింగ్ చెప్పాలి అనుకుంటున్నాడు.దీనికోసం మళ్ళీ హిందీ ప్రొఫిషియన్సీ కోసం స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చేస్తున్న సాహో ప్రభాస్ కి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా ముందు అనుకున్నట్టు ఆగస్టు 15 నే డెడ్ లైన్ గా పెట్టుకుని పని చేస్తున్నారట.ఈ సినిమా కూడా హిట్ అయితే మాత్రం ప్రభాస్ ఫుల్ ప్లెడ్జెడ్ ఆల్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోయినట్టే.