విజయ్ దేవరకొండ సినిమాలో ముంబై హీరోయిన్…!

Avantika-Mishra
Avantika-Mishra

సమీర్ దర్శకత్వంలో  పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను విజయ్ దేవరకొండ మారి కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించనున్నారు. అనసూయ భరద్వాజ్ ఇందులో ఓ కీలక పాత్ర చేస్తోంది.ఇందులో నటించే హీరోయిన్ ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్.

ముంబై కు చెందిన అవంతిక మిశ్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. గతంలో మాయ, మీకు మీరే మాకు మేమే వంటి సినిమాల్లో నటించింది.ఈ సినిమా  ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ సమ్మర్లోనే సినిమా ప్రారంభం కానున్నది.