ఆటోవాలా అవ‌తార‌మెత్తిన సిఎం చంద్ర‌బాబు

Chandra Babu naidu
Chandra Babu naidu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటోవాలా అవతారమెత్తారు. ఆటో డ్రైవర్‌ చొక్కా ధరించి తన నివాస ప్రాంగణంలో స్వయంగా ఆటో నడిపి అందరిలోనూ హుషారు నింపారు. ఆటోలపై జీవితకాల పన్ను ఎత్తివేస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆటో సంఘాలు ఆటోలతో సీఎం చంద్రబాబు నివాసానికి వచ్చి కృతజ్నతలు తెలిపాయి. చంద్రబాబు నివాస ప్రాంగణంలో పసుపు జెండాలతో ఆటోల ప్రదర్శన నిర్వహించారు.

పన్ను ఎత్తివేత నిర్ణయంపై ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లనుద్దేశించి మాట్లాడారు. తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి ఎన్నో దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానన్నారు సిఎం చంద్రబాబు .