అల్లు అరవింద్,దిల్ రాజుల ఫై నిర్మాత అశోక్ ఫైర్…!

ashok vallabhaneni

ప్రముఖ తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్,నిర్మాత అశోక్ వల్లభనేని స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్,దిల్ రాజు ఫై ఫైర్ అయ్యారు.వివరాలలోకి వెళితే తెలుగు పరిశ్రమలో ఏదైనా పెద్ద సినిమా వస్తోందంటే మిగతా చిన్న సినిమాలకు థియేటర్ల సమస్యలు తలెత్తడం ఎప్పుడూ జరిగే విషయమే. అదే పరిస్థితి ఈసారి సంక్రాతి సినిమాలకు ఎదురువుతోంది. 9వ తేదీన బాలయ్య ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, 11న చరణ్ ‘వినయ విధేయ రామ’లు రిలీజ్ అవుతున్నాయి.దీంతో ఎక్కువ శాతం థియేటర్లన్నీ ఆ సినిమాలకే కేటాయించారు. దీంతో 10న వస్తున్న రజినీ ‘పేట’కు సమస్య ఏర్పడింది.

ఈ ఇబ్బంది గురించి చిత్ర నిర్మాత అశోక్ వల్లభనేని భావోద్వేగానికి లోనై అల్లు అరవింద్, దిల్ రాజులు ఇలా థియేటర్లను గుప్పిట్లో పెట్టుకోవడం సబబు కాదని, వాళ్ళేమైనా థియేటర్లతోనే పుట్టారా, వాళ్ళ వలన చిన్న సినిమాలు చచ్చిపోతున్నాయి, నయీమ్ లాంటి గ్యాంగ్ స్టర్లను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను ఎందుకు షూట్ చేయడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.