మూడ‌వ ఫేజ్ కు చేరిన స్థానిక స‌మ‌రం

Elections
Elections

తెలంగాణ రాష్ట్రంలో పరిషత్ పోరు ఊపందుకొంది. 32 జిల్లాల్లోని మండల ప్రాదేశిక, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాలకు మూడువిడుతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. మూడోవిడుత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం అయింది. మూడోవిడుతలో 31 జిల్లాల పరిధిలో 161 ZPTC , 1738 MPTC స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మే 2వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ZPTC లకు మండలకేంద్రాల్లో , MPTC స్థానాలకు.. ప్రతి మూడు ఎంపీటీసీలకు ఒక గ్రామాన్ని రిటర్నింగ్ అధికారులకు కేటాయించి నామినేషన్లు తీసుకోనున్నారు. మే 6న అభ్యర్థుల తుదిజాబితాను విడుదల చేస్తారు. మూడోవిడుత పోలింగ్ 14వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.