తమిళ్ అర్జున్ రెడ్డి కష్టమే

ArjunReddy Remake in Tamil Varma
ArjunReddy Remake in Tamil Varma

బోల్డ్ లవ్ స్టోరీ గా తెరకెక్కి తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా అర్జున్ రెడ్డి.ఈ సినిమాని అనేక భాషల్లో రీమేక్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా తమిళ రీమేక్ వర్మ లో హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ హీరో గా నటిస్తున్నాడు.

వర్మ టీజర్ రిలీజ్ అయినప్పడు చాలా విమర్శలు వచ్చాయి.నేషనల్ అవార్డు విన్నర్ అయిన బాలా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.ఆయన ఈ సినిమా సోల్ ని అర్ధం చేసుకోకుండా కొత్త సినిమా చేస్తున్నాడు అన్న విమర్శలు కూడా వచ్చాయి.దాంతో ఈ సినిమాకి సంబంధించి కొన్ని రీ షూట్స్ జరిగాయి.ఇప్పడు రీసెంట్ గా సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. వర్మట్రైలర్ మరీ టీజర్ లా దారుణంగా లేకపోయినా మరీ అట్రాక్టివ్ గా మాత్రం అనిపించడం లేదు.

అర్జున్ రెడ్డి లో ఉన్న ఇంటెన్సిటీ ఇందులో పలుచబడినట్టు కనిపిస్తుంది.కేవలం లిప్ కిస్సెస్ అండ్ బోల్డ్ నెస్ మాత్రమే అర్జున్ రెడ్డి ని హిట్ గా నిలపలేదు.స్టోరీ లో ఉన్న రా నెస్ అండ్ రియలిస్టిక్ టచ్ అంత సెన్సేషన్ క్రియేట్ చేసాయి.వర్మ ట్రైలర్ కూడా అర్జున్ రెడ్డి లో ఉన్న షాట్స్ ని యాస్ ఇట్ ఈజ్ ఫాలో అవుతున్న ఎక్కడో ఎదో మిస్ అయిన ఫీలింగ్ మాత్ర అడుగడుగా కనిపిస్తుంది.కానీ ట్రైలర్ ని చూసి సినిమా ఫలితం అంచనావెయ్యడం కష్టం.

సో,వర్మ తమిళ్ ఎంతవరకు ఆకట్టుకుంటాడు,ఎలాంటి విజయం అందుకుంటాడు అనేది మరి కొద్దీ రోజుల్లో తెలుస్తుంది.