ఏపిఎస్ ఆర్టీసీ లో ఉద్యోగుల‌ స‌మ్మె సైర‌న్

rtc-strike
rtc-strike

ఆంద్ర‌ప్ర‌దేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. రాష్ట్రంలో ఫిబ్రవరి 6 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయనున్నట్లు ఆర్టీసీ ఉద్యోగుల సంఘాల జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిపివేయాలని జేఏసీ డిసైడ్ అయింది. సమ్మెలో ఈయూ సహా 9 కార్మిక సంఘాలతో కూడిన జేఏసీ పాల్గొననుంది.

50 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. డిసెంబర్‌ 31న ఆర్టీసీ యాజమాన్యానికి 91 డిమాండ్లతో యాజమాన్యానికి ఈయూ సమ్మె నోటీసు ఇచ్చింది. కార్మిక సంఘాలతో ఆర్టీసీ యాజమాన్యం పలుమార్లు చర్చలు జరపారు. 20 శాతానికి మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని యాజమాన్యం వెల్ల‌డించింది.