విశాఖ జిల్లాలో దాదాపుగా ఖ‌రారైన టిడిపి అభ్య‌ర్ధులు

TDP,AP ELECTION,YCP,RAMPULLAREDDY,

ఏపిలో పొలిటిక‌ల్ హీట్ పెరిగింది. ఇప్ప‌టికే అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల స‌మ‌ర శంఖం పూరించింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సిఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ స్పష్టంగా ఉన్న పలు నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. తాజాగా విశాఖ, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సీట్లకు సంబంధించిన సమీక్ష పూర్ల‌యింది. అయితే ఎంపీల అభ్యర్ధుల ఎంపికలో ఇంకా క్లారిటీ రాలేదు.

విశాఖ పార్లమెంట్‌ అభ్యర్ధి ఎంపికకు సంబంధించి మాజీ ఎమ్మెల్సీ ఎంవీ వీఎస్‌ మూర్తి మనుమడు, బాల‌కృష్ణ రెండ‌వ అల్లుడు భరత్‌ విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే బీసి వర్గాలకు చెందిన అభ్యర్ధిని ఎంపిక చేయాలని సీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఇక మంత్రి లోకేష్‌ విశాఖ నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే భీమిలి, ఉత్తర నియోజకవర్గాల్లో ఏదైనా ఒక చోట నుంచి లోకేష్‌ పోటీ చేసే అవకాశాలున్నాయి. లోకేష్‌ నిర్ణయాన్ని బట్టి మంత్రి గంటా ఆ రెండిం టిలో ఒక చోట నుంచి బరిలోకి దిగనున్నారు.ఇప్ప‌టివ‌ర‌కు ఖ‌రారైన జాబితా ప్ర‌క‌రాం విశాఖ ఎంపి – పెండింగ్‌, అనకాపల్లి ఎంపి – కొణతాల / ఆడారి ఆనంద్‌, అరకు ఎంపి – కిషోర్‌ చంద్రదేవ్‌, విశాఖ తూర్పు – వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ పశ్చిమ- పీజీవిఆర్‌ నాయుడు (గణబాబు), విశాఖ ఉత్తరం – లోకేష్‌ / మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ దక్షిణం – వాసు పల్లి గణష్ కుమార్‌, పెందుర్తి – బండారు సత్య నారాయణమూర్తి, గాజువాక – పల్లా శ్రీనివాస్‌, భీమిలి – లోకేష్‌ / మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి – పెండింగ్‌, యలమంచలి – పంచకర్ల రమేష్‌బాబు, నర్సీపట్నం – మంత్రి అయ్యన్న పాత్రుడు, చోడవరం – పెండింగ్‌, మాడుగుల – పెండింగ్‌, పాయకరావుపేట – పెండింగ్‌, అరకు – మంత్రి కిడారి శ్రావణ్‌, పాడేరు – పెండింగ్ లో వుంచారు.