రోజుకో మలుపు తిరుగుతోన్న డేటా వార్

Data Theft
Data Theft

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య డేటా వార్ రోజుకో మలుపు తిరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతల మధ్య మాటల దుమమారం మరింత వేడిని పెంచుతోంది. ఒకరి ఆరోపణలకు మరొ కరు ధీటుగా సమాధానం ఇస్తూ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ మంత్రులు గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇటు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణకు ప్రత్యేక విచారణ బృందం (సిట్) ను ఏర్పాటు చేసింది. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య డేటా వార్ పీక్ స్టేజ్ కు చేరింది.

కాగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఏపి సిఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఐటీ గ్రిడ్లోని పార్టీ సమాచా రాన్ని తెలంగాణ ప్రభుత్వం దొంగిలించి వైసిపికి కు ఇచ్చారని పూర్తిస్థాయిలో నిర్ధారణకు వచ్చిన ఏపి సర్కారు. ఈ అంశంపై గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది . ఈ మేరకు ఏపి సిఎం చంద్రబాబు సీనియర్ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు, పోలీసు, న్యాయ శాఖ అధికా రులతో సమావేశమయ్యారు.

తెలంగాణ ప్రభుత్వంపై పరువు నష్టం దావా వేయాలని మంత్రులు, అధికారులకు సూచించారు.. పార్టీ సమాచారాన్ని దొంగిలించి ప్రతిపక్ష వైసిపికు అందించి లబ్ది చేకూర్చాలన్న లక్ష్యంతోనే టీఆర్ఎస్ ఇటువంటి కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని చంద్రబాబు మండిపడినట్లు సమాచారం.

తమ పార్టీ డేటాను తెలంగాణ పోలీసులు దొంగిలించి వైసిపికు చేరవేశారని రాష్ట్ర మంత్రులు కళా వెంకట్రావు, ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తక్షణం స్పందించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని కోరారు.