ప్రత్యేక హోదా ఆందోళ‌న‌లు తీవ్ర‌త‌రం

chalasani srinivas

ప్రత్యేక హోదా,విభజన హామీలసాధన సమితి కేంద్ర స‌ర్కారుపై పోరాడేందుకు సిద్ధమైంది. ప్రధాని మోదీ ఏపీ పర్యటనలో నిరసన వ్యక్తం చేయాలని డిసైడ్ అయింది. విజ‌య‌వాడ‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించిన ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నాయకులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.మోదీ రాష్ట్రానికి వచ్చే సమయంలో ఖాళీ కుండల ప్రదర్శన చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఇక ఓటాన్‌ అకౌంట్‌ రోజున‌ బంద్ కు పిలుపునిచ్చారు.విద్యార్థులతో గుంటూరు, విజయవాడలో భారీ ర్యాలీ జ‌ర‌పాల‌ని తీర్మానించారు.నాగార్జున యూనివర్సిటీ ఎదుట భారీ బహిరంగ సభ, రాష్ట్ర సరిహద్దుల ముట్టడి, రైల్‌రోకో చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.