ప్ర‌తిప‌క్ష‌నేత‌పై స్పీక‌ర్ ఫైర్

Kodela Siva Prasada Rao
Kodela Siva Prasada Rao

ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ పై స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ఒక అవినీతి పరుడు, దుర్మార్గుడు పార్టీ పెట్టి నీతి గురించి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తాను అవినీతి పరుడినంటూ జగన్ చేసిన విమర్శలకు ఖండించిన ఆయన తాను నిప్పులా బతికానని చెప్పుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్ మాట్లాడుతూ తప్పు చేయాల్సివస్తే రాజకీయాలు మానుకొని వెళతామ‌న్నారు. తప్పుచేస్తే చూపించాల‌ని, ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి మాట్లాడాల‌న్నారు. జగన్‌ రమ్మన్న చోటకు తాను వస్తానంటూ అంటూ కోడెల సవాల్‌ విసిరారు .