జ‌న్మ‌భూమిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఏపి స‌ర్కార్

Janmabhoomi

తెలుగుదేశం పార్టీ జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంతో సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో ఆంద్రప్ర‌దేశ్ లో అధికార పార్టీ ఏ ఒక్క అవ‌కాశాన్ని వ‌దులు కోవ‌డానికి సిద్దంగా లేదు.గ‌త ప‌ది రోజులుగా ప‌ది శ్వేత ప‌త్రాల‌ను విడుద‌ల చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు… తాను తెర‌చివుంచిన వైట్ పేప‌ర్ లాంటివాడిన‌ని నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేశారు.కొత్త రాష్రంలో ప్రజల ఆదాయాన్ని పెంచే అనేక చర్యలు చేపట్టామని, ఇలాంటి చర్యలను ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ చేయలేదని చెప్పుకొచ్చారు.

బుధ‌వారం నుంచి జన్మభూమి గ్రామసభల్లో, వార్డు సభల్లో నాలుగున్నరేళ్ల ప్రగతి, సమస్యలపై చర్చిస్తామని చెప్పారు. పదిరోజుల పాటు నిర్వహించే జన్మభూమి సభల్లో ప్రజలకు వివరిస్తామని,వ్యవసాయ రంగంలో 97 శాతం ఆదాయం పెంచగలిగామని చెప్పేందుకు స‌రైన వేదిక‌గా తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వం భావిస్తోంది.ఈ నేప‌ధ్యంలో ఈ నెల 11వ తేదీ తర్వాత ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని చంద్రబాబు ప్ర‌క‌టించారు. మొత్తానికి జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మాన్ని జ‌న‌రంజ‌కంగా నిర్వ‌హించేందుకు ఆంద్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఇప్ప‌టికే అన్ని క‌స‌ర‌త్తులు చేసింది.