ఏపి పోలింగ్ పై ఎవరి ధీమా వారిదే ..!

AP Elections 2019
AP Elections 2019

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మునుపెన్నడూ ఎన్నడూ లేని విధంగా ఈసారి రాష్ట్రంలో ఓటర్ల చైతన్యం వెల్లి విరిసింది. ఆ చైతన్యానికి ఈసీ తన చేతకాని తనం, ఎన్నికల నిర్వహణకు సన్నద్ధ లోపం కారణంగా గండి కొట్టేందుకు ప్రయత్నించింది. అయితే ఓటరు చైతన్యం ముందు ఆ ప్రయత్నాలు ఫలించలేదని తేలిపోయింది. రాష్ట్రంలో దాదాపు 30 శాతం ఈవీఎంలు మొరాయించాయి . ఒకే ఒక్క రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద సంఖ్యలో ఈవీఎంలు మొరాయించడం ఇదే ప్రథమంగా చెబుతున్నారు.

ఒకవైపు ఎండ మాడ్చేస్తున్నా…ఈవీఎంల మొరాయింపు సహనాన్ని పరీక్షిస్తున్నా.. ఓటర్లు మాత్రం వెనుదిరగలేదు. అర్ధరాత్రి దేటే వరకూ వేచి ఉండి మరీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపుగా రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం పైగా పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. పోలింగ్ శాతం పెరగడంతో తమ విజయం ఖాయమని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం, వైసిపి లు అధిక ఓటింగ్ తమకే లాభిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. ఎవరి ధీమా నిలబడుతుందో తెలియాలంటూ మరో ఐదువారాలు వేచి చూడాల్సిందే…