ఈవీఎంల‌పై ఏపి సిఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

AP Cm Chandra Babu Naidu
AP Cm Chandra Babu Naidu

ఈవీఎం ఓటింగ్ విధానం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఈవీఎంలతో ఎన్నికల ఫలితాలు తారుమారు చేయవచ్చని నిపుణులు అంటున్నారన్నారు.ఎన్నికల ఫలితాల తారుమారు విషయం ఆందోళన కల్గిస్తోందని ఆయ‌న‌ చెప్పారు.కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలన్నారు.

పేపర్ బ్యాలెట్ విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు.అయితే ఇటు ఈవీఎంల ట్యాంపరింగ్‌ అసాధ్యమని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది.లండన్‌లో కొందరు వీటిని ట్యాంపరింగ్‌ చేయవచ్చని చెప్పినట్టు తమ దృష్టికి వచ్చిందని ఈసీ అధికారులు వెల్ల‌డించారు.ఈవీఎంలు లోపరహితమైనవని వారు క్లారిటీ ఇచ్చారు. అత్యంత భద్రత నడుమ వీటిని తయారు చేస్తున్నామని వివ‌రించారు.