టీఆర్‌ఎస్‌ టోన్‌ మారింది – ఏపి సిఎం

AP CM Chandra Babu Naidu
AP CM Chandra Babu Naidu

40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నానని.. గెలుపు తమదేనన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ ఆయన టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నూటికి వెయ్యి శాతం టీడీపీ గెలవబోతోందని.. మెజార్టీనే చూసుకోవాలన్నారు. తన దగ్గర చాలా సర్వే రిపోర్టులున్నాయన్నారు. కాలం గడిచేకొద్దీ ఏపీలో అందరి స్వరాలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు. బూత్‌ల వారీగా ఎగ్జిట్‌ పోల్స్‌ తన వద్ద ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. టీఆర్‌ఎస్‌ టోన్‌ మారిందని.. దేశ వ్యాప్తంగా బీజేపీ బలహీనపడిందన్నారు. ప్రభుత్వం, పథకాలపై ప్రజల్లో సానుభూతి ఎక్కువగా ఉందన్నారు ఆయ‌న‌. వైసీపీ మైండ్‌గేమ్‌ను తిప్పికొట్టాలన్నారు. కౌంటింగ్‌లో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు సిఎం చంద్రబాబు .