అన్యాయం చేసిన పార్టీకి పుట్ట‌గ‌తులుండ‌వు – ఏపి సిఎం చంద్ర‌బాబు

TDP, Jagan, YSR, YSRPARTY,
Chandra Babu

ఆంద్ర‌ప్ర‌దేశ్ కు అన్యాయం చేసిన కేంద్రానికి ఎవ్వరూ సహకరించవద్దన్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీకి పుట్టగతులు లేకుండా చేయాలన్నారు. జగన్ పై జరిగిన దాడి కేసు ద్వారా ప్రభుత్వంపై బుర‌ద‌జల్లాలని చూస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం కేసరిపల్లిలో నిర్వహించిన పసుపు-కుంకుమ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు హాజ‌ర‌య్యారు.

రాష్ట్రంలో 94 లక్షల మందికి పసుపు-కుంకుమ కింద ఆర్థిక సాయం చేస్తున్నామని ఆయ‌న వివ‌రించారు. డ్వాక్రా మహిళలకు మూడు విడతల్లో రూ.10 వేలు పంపిణీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మూడు చెక్కులను ముందస్తు తేదీలతో ప్రభుత్వం ఒకే సారి ఇస్తోంద‌న్నారు సిఎం. దేశంలో ఎక్కడాలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు ముఖ్య‌మంత్రి .