అభివృద్ది – సంక్షేమానికి కేరాఫ్ అడ్ర‌స్ తెలుగుదేశం – సిఎం చంద్ర‌బాబు

N Chandrababu Naidu
N Chandrababu Naidu

మళ్లీ తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పగిస్తే ప్రస్తుతం ఇస్తున్న రెండు వేల రూపాయ‌ల పెన్షన్ ను మూడు వేల‌కు పెంచుతామని చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అలాగే వృద్ధాప్య పెన్షన్ పొందేందుకు కనీస వయసును 60 ఏళ్లకు తగ్గిస్తామని అభ‌యం ఇచ్చారు ఆయ‌న‌. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో 3.91 కోట్ల మంది ఓటర్లు ఉంటే, 98 లక్షల మంది ప్రజలకు పసుపు-కుంకుమ ఇచ్చామన్నారు ఆయ‌న‌.

రాష్ట్రంలో మహిళలు అంతా టీడీపీకి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్ల‌డించారు. ప్రస్తుతం ఏపీలో 65 లక్షల మందికి ఫించన్లు, నిరుద్యోగ భృతి ఇస్తున్నామని సీఎం వివ‌రించారు. దాదాపు 45 లక్షల మంది రైతులకు అన్నదాత – సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తున్నామనీ, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నామన్నారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు .