పాద‌యాత్ర కాదు ఫాన్సీ యాత్ర – ఏపి సిఎం చంద్ర‌బాబు

AP Cm Chandra Babu Naidu
AP Cm Chandra Babu Naidu

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ముగింపు స‌భ‌లో ఏపి ప్ర‌తిస‌క్ష నేత జ‌గ‌న్, సిఎం చంద్ర‌బాబు స‌ర్కారును టార్గెట్ చేశారు. ఆ పార్టీకి ఓటేస్తే అన్నీ గోవిందా అంటూ గ‌ళం విప్పారు. ముఖ్య‌మంత్రి తీరును ఎండ‌గ‌ట్టారు.అయితే దీనికి ప్ర‌తిగా ఏపి సిఎం చంద్ర‌బాబు ఫైర‌య్యారు. అమరావతిలో మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసింది పాదయాత్ర కాదని విహారయాత్ర చేశారని ఎద్దేవా చేశారు.

జగన్ విహారయాత్రను ముగించుకున్నారన్నారు.ప్రతివారం ఇంటికి వెళ్తూ.. శుక్రవారం కోర్టుకు వెళ్తూ.. చేసిన ఫ్యాన్సీ యాత్రకు పవిత్రత ఎక్కడ ఉందని ప్ర‌శ్నించారు. తాను పాదయాత్ర చేసినపుడు వచ్చిన కాలునొప్పి ఇంకా తగ్గనే లేదన్న సీఎం… ఏనాడైనా రాత్రి ఏడుగంటల తర్వాత జగన్ పాదయాత్ర కొనసాగించాడా అని ఎద‌రుదాడికి దిగారు. జగన్ పాదయాత్రను ఓ విహారయాత్రగానే చేశాడని సిఎం చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు.