విజ‌యంపై ఏపి సిఎం ధీమా

chandrababu-naidu
chandrababu-naidu

రాష్ట్రంలో తెలుగుదేశం విజయం ఖాయమైందన్నారు ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు. అది వంద శాతం కాదు.. వెయ్యి శాతం అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ పార్టీ అభ్యర్థులతో ఆయన అమరావతిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మన కోసం క్యూలో వుండి ఓట్లు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పాలని సూచించారు. మీరు ముందుండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. ప్రజల అవసరాలు తీర్చాల‌ని ఆదేశించారు. కోడ్‌ నెపంతో పాలన కుంటుపడొద్దన్నారు. ఎన్నికలు పూర్తయిన చోట్ల అభివృద్ధి కుంటుపడకుండా… ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా పాలన సాగాలని, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నేతలకు సూచించారు. పంటను అమ్ముకునే పరిస్థితి లేకపోతే నిరాశకు గురవుతారని, సూక్ష్మ సాగు, సేధ్యం పనులు కోడ్‌ వల్ల ముందుకు సాగడంలేదని అన్నారు. దీని వల్ల ఉద్యాన పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.