సిఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ

AP cabinet meeting
AP cabinet meeting

ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జ‌రిగింది. ఈసమావేశంలో రాష్ట్రంలో కరువు, ఫొని తుఫాను ప్రభావం, తాగునీటి ఎద్దడితో పాటు వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కీలకంగా చర్చించిన‌ట్లు స‌మాచారం. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ప్రభుత్వం ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే తమ అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది.

ధరల సవరింపు, బకాయిల చెల్లింపులపై అనుమతి తీసుకున్నాకే అమలు చేయాలని సూచించింది. ధరల పెంపునకు సంబంధించిన నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించొద్దని సూచించింది. ఈ భేటీలో మంత్రులు, పలు శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. మ‌రోవైపు కేబినెట్‌ భేటికి ముందు ఏపి సియం చంద్రబబాబు మంత్రులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోలింగ్‌ తీరు, కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపినట్లు సమాచారం.