ఏపి కేబినెట్ భేటీలో మ‌రికొన్ని వ‌రాలు

AP cabinet meeting
AP cabinet meeting

ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. అమరావతిలో జరిగిన ఈ భేటీకి ముఖ‌మంత్రి చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త వ‌హించారు. అన్నదాత సుఖీభవ పథకం విధివిధానాలపై చర్చించారు. ప్రతి రైతు కుటుంబానికి రూ. 10 వేలు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఫిబ్రవరి చివరి వారంలో చెక్కులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. వచ్చే ఖరీఫ్ నుంచి కౌలు రైతులను కూడా ఆదుకునేలా మార్గదర్శకాలను రూపొందించాలని నిర్ణయించారు.

డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, సిమ్ కార్డుతోపాటు మూడేళ్ల పాటు కనెక్టివిటి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు 30 ఎకరాలు కేటాయింపు, ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 30 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయించారు. అలాగే ఎన్జీఓలు, సచివాలయ ఉద్యోగులకు 175 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ.. చదరవు గజం రూ.4 వేల చొప్పున 230 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది.