గవర్నర్ ను కలసిన ఏపి బిజేపి నేతలు

Met with Hon Governor of AP & TS Shri ESL Narasimhan today along with other @BJP4Andhra leaders
Met with Hon Governor of AP & TS Shri ESL Narasimhan today along with other @BJP4Andhra leaders

ఐటీ కేసుపై టీడీపీ వైసీపీ డ్రామాలాడుతున్నాయన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. దీనిపై సిబిఐ విచారణ జరపాలని కోరుకుంటున్నామన్నారు. ఏపీ బీజేపీ నేతలు రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను రాజ్ భవన్ లో కలిశారు. గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు ఆంద్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లోపించాయని వెంటనే ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డేటా లీక్ పై త్వరలోనే కేంద్ర హోం మంత్రిని, కేంద్ర ఎన్నికల అధికారిని కలుస్తామన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా. ఐటీ గ్రిడ్ సంస్థ ఐదు కోట్ల ఆంధ్రుల డేటాను దొంగిలించారని, ప్రజల పర్సనల్ డేటాను టాంపర్ చేశారని ఆయన ఆరోపించారు.