ఏపీ బీజేపీ తొలి జాబితా వెల్ల‌డి

BJP Party
BJP Party

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది బిజేపి. 123 మందితో ఏపీ బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ అధిష్టానం జాబితాలోని సభ్యుల పేర్లను ప్రకటించింది. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సీనియర్ నేతలు హాజరయ్యారు.

నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ సహా లోక్‌సభ తొలి విడత ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై భేటీలో నేతలు చర్చించారు. తెలుగు రాష్ర్టాల అభ్యర్థుల ఎంపికపై సమావేశంలో చర్చను చేపట్టారు. తెలుగు రాష్ర్టాల బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్, కన్నా లక్ష్మీనారాయణ ఈ స‌మావేశానికి హాజరయ్యారు.

ఏపీలోని విజయవాడ (సెంట్రల్)- సత్యమూర్తి, విజయవాడ (వెస్ట్)- పీయూష్ దేశాయ్, గుంటూరు (వెస్ట్)- సినీనటి మాధవీలత, విశాఖ (నార్త్) అభ్యర్థిగా విష్ణు కుమార్ రాజు, త‌దిత‌రుల‌తో మిగిలిన స్థానాలకు ఆయా అభ్యర్థుల పేర్లను వెల్ల‌డించింది.