ఫిబ్రవరి 1న ఏపి బంద్

AP Bandh
AP Bandh

ఆంద్ర‌ప్ర‌దేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 1న ప్రత్యేక హోదా సాధనా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ కు రాష్ట్ర ప్ర‌త్యేక సాధ‌నా స‌మితి పిలుపునిచ్చింది. కేంద్ర బడ్జెట్‌ ప్రకటించే రోజే బంద్‌కు పిలుపునిచ్చారు. ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసిన అనంతరం సంస్థ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.

బంద్‌కు మద్దతుపై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడుతున్నామ‌ని వెల్ల‌డించారు. సీఎం చంద్రబాబును కూడా కలిసి సహకరించాలని కోరామ‌ని వివ‌రించారు. దశలవారీగా ఉద్యమం చేస్తామన్నారు చలసాని. త్వరలో అమరావతిలో విద్యార్థులతో మహాసభ పెడుతున్నాం అని సంస్థ అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ తెలిపారు.