అసెంబ్లీలో ఏపి అవార్డుల గ్యాల‌రీ

AP Cm Chandra Babu Naidu
AP Cm Chandra Babu Naidu

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన పలు అవార్డులు ప్రభుత్వ పని తీరుకు నిదర్శనమన్నారు సిఎం చంద్ర‌బాబు. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖలకు కేంద్రం ఇచ్చిన అవార్డుల ప్రదర్శనను ఆయ‌న ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరుకు గీటురాయి ఈ అవార్డులన్నారు సిఎం.

అందరూ కష్టపడి పనిచేయడం వల్లే అవార్డులు వచ్చాయని తెలిపారు ఆయ‌న‌. ప్రభుత్వంలోని వివిధ శాఖలకు మొత్తం 670 అవార్డులు వచ్చాయని వివ‌రించారు ఏపి సిఎం చంద్ర‌బాబు . కేంద్రం చేస్తున్న విమర్శలకు ఈ అవార్డులే సమాధానమన్నారు ఆయ‌న‌.