వ‌చ్చేనెల 8 వ‌ర‌కు ఏపి అసెంబ్లీ

AP Assembly
AP Assembly

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఫిబ్రవరి 8 వర‌కు జ‌ర‌గ‌నున్నాయి. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జ‌రిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 7 పని దినాల పాటు అసెంబ్లి సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి ఒకటిన‌ విభజన సమస్యలు, ప్రత్యేక హోదా అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు.

2 నుంచి 4వ తేదీ వరకు సెలవు ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 5వ తేదీన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. 6వ తేదీన గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపేందుకు చర్చించ‌నున్నారు. 7వ తేదీన సంక్షేమం, ఇతర శాఖలు, ఎనిమిదవ తేదీన విజన్‌ డాక్యుమెంట్‌పై చర్చిస్తారు . దీంతో శాస‌న‌స‌భ సమావేశాలు ముగియ‌నున్నాయి.