ఈ నెల 30 నుంచి ఏపి అసెంబ్లీ స‌మావేశాలు

Andhra Pradesh Legislative Assembly
Andhra Pradesh Legislative Assembly

ఈనెల 30వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయ‌న అధ్యక్షతన TDP సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…. ఫిబ్రవరి 8 వరకూ సమావేశాలు జరిగే అవకాశముందన్నారు. అమరావతి ధర్మపోరాటం సభ విజయవంతం మన ముందున్న లక్ష్యాలన్నారు.

కౌలు రైతులు సహా అందరికీ పెట్టుబడి సాయం చేసేందుకు సలహాలు ఇవ్వాలని,పెట్టుబడి సాయంపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని సీఎం చంద్రబాబు అన్నారు.రాష్ట్రంలో 95 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారని..సమర్థంగా పనిచేస్తున్నారన్నారు.ఆర్థిక ఇబ్బందులున్నా వారికి 10వేలు ఇవ్వాలని చూస్తున్నామన్నారు.రైతుల రుణమాఫీకి సంబంధించి మిగిలిన రెండు విడతలు ఇచ్చేస్తున్నామన్నారు.