ఏపి అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

AP Assembly
AP Assembly

ఆంద్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ 14వ సమావేశాలు ఆరు రోజుల పాటు జరిగాయి. 38 గంటల 13 నిమిషాలపాటు శాస‌న స‌భ స‌మావేశాలు సాగాయి. ఈ సమావేశాల్లో స్టార్‌ ప్రశ్నలు 21, సాధారణ ప్రశ్నలు ఏడింటిని సభ్యులు సంధించారు . మొత్తం 70 మంది సభ్యులు ప్రసంగించారు. 20 బిల్లులను సభ ఆమోదించింది. శాస‌న‌ మండలిలో 6 బిల్లులను ఆమోదించారు.

ఇందులో కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు, కాపులు మినహా ఆర్థికంగా వెనుకబడిన ఇతర సామాజిక వర్గాల వారికి 5 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లు, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించే బిల్లు, ఏపీ కోపరేటివ్‌ సొసైటీల బిల్లు, ద్రవ్యవినిమయ బిల్లుతో పాటు రెవెన్యూకి సంబంధించిన రెండు బిల్లులు ఉన్నాయి. శాసన మండలి 6 రోజులు జరిగింది. 23.04 గంటలపాటు పని చేసింది.